గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (17:31 IST)

తెలంగాణ ఎంసెట్ పరీక్షా తేదీల్లో స్వల్ప మార్పులు...

eamcet
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు ఉన్నాయి. ఈ మార్పుల ప్రకారంగా ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షలతో పాటు టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 
మరోవైపు, ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది.