1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (20:40 IST)

ఆసియా తొలి మహిళా పైలట్.. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరింది?!

Surekha Yadav
Surekha Yadav
కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేఖ యాదవ్ నడిపారు. తద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్న ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా ఆమె అవతరించారు. లోకోమోటివ్ రవాణా రంగంలో దూసుకుపోతున్ మహిళ.. విశేషమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 
 
సోమవారం, ఆమె షోలాపూర్ స్టేషన్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య రైలు ప్రయాణాన్ని నైపుణ్యంగా నావిగేట్ చేసింది. 450 కిలోమీటర్లను ఐదు నిమిషాల ముందే చేరారు. పరిశ్రమలోని మహిళలకు చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసింది. 
 
1988లో భారతదేశపు మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా అవతరించింది. ఈమె పశ్చిమ మహారాష్ట్ర సతారా ప్రాంతానికి చెందినవారు. ఆమె అత్యుత్తమ విజయాల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక ప్రశంసలు అందుకుంది. 
 
అత్యాధునికమైన వందే భారత్ రైలును పైలట్ చేసే అవకాశం లభించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ అద్భుతాన్ని ఆపరేట్ చేయడం పట్ల యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.