ఏపీలో నేడు రేపు తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రేపు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ సందర్భంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కృష్ణ, తూర్పు గోదావరి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, ప్రకాశం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఈదురు గాలులకు వరి పంట నేలమట్టమైంది.