సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజీ ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటింనున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించి, ఇపుడు నిర్మాణ పనులు పూర్తయిన మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజీ (సంగం బ్యారేజీ)ని ఆయన ప్రారంభిస్తారు. దీన్ని బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జిగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో ప్రారంభమవుతారు. 10.40 గంటలకు సంగం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పెన్నా బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.