సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (23:09 IST)

ఏలూరు, నెల్లూరుల్లో రైతులకు ఆక్వాకల్చర్ శిక్షణ వర్క్‌షాప్‌లు

Aqua ponds
ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా ఫౌండేషన్ (FWI India) నెల్లూరు, ఏలూరు జిల్లాలలో చేపల సంక్షేమంపై ఆక్వాకల్చర్ శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు ఆంధ్రా ఫిషరీస్, భవి ఆక్వా- ఫిష్ ఎఫ్‌.పి.ఓ, గ్రామోదయ ట్రస్ట్, సి.ఆర్. రెడ్డి కాలేజీ మద్దతు ఇచ్చాయి. హాజరైన రైతులు మత్స్య నిపుణులు డా.జి.పి.సత్యనారాయణరావు, డా.పురుషోత్తంసాయి, శ్రీ.బి.విష్ణుభట్, డా.రామ్మోహనరావు, శ్రీ భూపేష్ రెడ్డి నుండి సదస్సులకు హాజరయ్యారు. ఈ నిపుణులు రైతులకు చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, చెరువు రికార్డుల నిర్వహణ, ఫిషరీస్, ఎఫ్‌పిఓల ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు.

 
FWI ఇండియా, 2021లో స్థాపించబడిన స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, నెల్లూరు జిల్లాల్లోని రైతుల కోసం తరచుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. దాని ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్, అలయన్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఆక్వాకల్చర్ (ARA), ఆక్వాకల్చర్ ఉత్తమ పద్ధతుల ద్వారా చేపల సంక్షేమంపై రైతులకు, కార్పొరేషన్‌లకు NGOలకు శిక్షణనిస్తుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ కార్తీక్ పులుగుర్త, “ఈ శిక్షణా వర్క్‌షాప్‌లు చేపల సంక్షేమంతో బలమైన వ్యాపారాన్ని నిర్మించడంపై రైతులకు అవగాహన కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా, ఆక్వాకల్చర్ రంగానికి చెందిన అధికారులు నిపుణులతో జ్ఞానాన్ని పంచుకోవడానికి మేము వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము" అన్నారు.

 
ఈ రంగంలోని నిపుణుల నుంచి సమాచారం పొందాలని కోరుకునే రైతులకు ఈ తరహా వర్క్‌షాప్‌లు తప్పనిసరి. ఈ రెండు శిక్షణా కార్యక్రమాలలో అత్యంత కీలకమైన సదస్సులలో ఒకటిగా  వ్యాధుల నిర్వహణ కొనసాగింది. ఏపీ ఫిషరీస్‌ రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రావు దీనిని నిర్వహించారు. వ్యాధులను ఎలా గుర్తించాలో రైతులు తెలుసుకోవడంతో పాటుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా దానిని నియంత్రించవచ్చో తెలుసుకున్నారు.

 
భావి ఆక్వా, ఫిష్ ఎఫ్‌పిఓ వంటి రైతు ఉత్పత్తి సంస్థలతో భాగస్వామ్యాన్ని నిర్మించడం ద్వారా, ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగంలో ట్రేస్‌బిలిటీని (traceability) సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ముందు, రైతులు, కార్పొరేషన్లు మరియు NGOల మధ్య సంభాషణను ప్రారంభించడానికి FWI ఇండియా ఒక కార్పొరేట్ ఈవెంట్‌ను నిర్వహించింది. అధిక సంక్షేమ చేపల గురించి కార్పొరేట్‌లకు అవగాహన కల్పించడానికి మరియు వారి కొనుగోలు పద్ధతులలో వాటిని చేర్చమని కోరడానికి ఇది ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ.ఆర్‌.ఏ. రైతులు తమ చేపల పెంపకం గురించి వివరించారు.

 
రాష్ట్రంలో చేపల పెంపకందారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో ఒకటిగా నీటి పరీక్ష, నిర్థేశిత పరిష్కారాలు అందించే లేబరేటరీలు పరిమిత సంఖ్యలో  లేదంటే అసలు లేబరేటరీలు లేకపోవడం నిలుస్తుంది. అదనంగా, నీటి నాణ్యతకు సంబంధించిన పరీక్షలు తెలుపడానికి గంటలు లేదంటే రోజుల సమయం పడుతుంది.  అతి  తక్కువ ఆక్సిజన్‌ పరిమాణం కలిగిన  నీరు కలిగిన ప్రాంతాలలో చేపలకు ఇది మరణశాసనంగా నిలుస్తుంది. ఎఫ్‌డబ్ల్యుఐ ఇండియా ఇప్పుడు ఏఆర్‌ఏ ఫార్మర్స్‌తో కలిసి పనిచేయడంతో పాటుగా క్రమంతప్పకుండా  రైతుల చెరువులలో నీళ్ల పరీక్షలు జరిపి సమస్యలకు తగిన పరిష్కారాలను కూడా చూపుతుంది.