గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏలూరు జిల్లాలో బోల్తా పడిన ఆరెంజ్ బస్సు - 11 మందికి గాయాలు

oragne bus accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఓ ఆరంజ్ ట్రావెల్స్‌ ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు బోల్తాపడింది. జాతీయ రహదారి 16వ నంబరులో ఈ బస్సు మంగళవారం ఉదయం బోల్తాపడింది. ఈ ఘటనలో 11 మంది గాయప్డడారు. 
 
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తుండగా దెందులూరు వద్దకు చేరుకునేసరికి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. 
 
బస్సు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.