ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (15:03 IST)

‘పాపం పసివాడు’.. జగన్ చాలా అమాయకుడు.. పవన్ ఎద్దేవా

pawan kalyan
జనసేన-వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. జనసేన పార్టీ అధినేత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయన్నారు. పనిలో పనిగా పవన్ మూడు పెళ్లిళ్లను మళ్లీ లాగుతూ తన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. తాజాగా సీఎం జగన్‌ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా, పవన్ జగన్ పరిస్థితిని ‘పాపం పసివాడు’ అనే ఫీచర్ ఫిల్మ్‌తో పోల్చారు.
 
"అతను (జగన్) చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం: అతని చేతిలో ‘సూట్‌కేస్‌’కి బదులుగా, తన అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసిన బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి.. "అని పవన్ అన్నారు.
 
ఏదో ఒక రోజు రాయలసీమ జగన్ మరియు అతని అనుచరుల గుంపు నుండి విముక్తి పొందుతుందని జనసేన అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ఏపీ నదుల ఒడ్డున వున్న ఇసుకను దోచుకోవాలని ఆరోపించారు.