సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:29 IST)

ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం: పవన్ సంకల్పం

దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ స‌మీపంలోని శంక‌రాప‌ల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు.

ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని పవన్ ఆకాంక్షించారు. ‘‘సాయంత్రం 5.30-6.30 మధ్య సంధ్యా సమయంలో మత సామరస్యం కోసం, ధర్మపరిరక్షణ కోసం దీపాలు వెలిగించండి.

సమస్యను, అన్యాయాన్ని అర్థం చేసుకోగల శక్తి మహిళలకు ఉంది. అందుకే ధర్మ పరిరక్షణకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు మహిళలు మందుకు రావాలి’’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.