1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (21:22 IST)

రేపు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - ప్రధాని మోడీతో భేటీ

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వైజాగ్ రానున్నారు. ప్రధానితో భేటీ అయ్యేందుకు పవన్ వైజాగ్ వెళుతున్నారు.
 
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు వస్తున్న ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణఅ రేపు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే ప్రధానితో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్థితులను ప్రధానికి ఆయన వివరించనున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా పవన్ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉంటారు. అయితే, ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా హాజరువుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరువుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.