గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:25 IST)

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు

సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి  పూర్తిస్థాయిలో  పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పి. రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అందజేస్తున్న అన్ని రకాల పెన్షన్లను  ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా సోషల్ ఆడిట్ లో అర్హులుగా నిర్ధారణ అయిన లబ్ధిదారులకు ఈనెల పెన్షన్ మరియు వచ్చే నెల పెన్షన్ ను ఒకేసారి  అందజేయడం జరుగుతుందని సీఈవో వెల్లడించారు.

నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి పారదర్శకంగా పెన్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.

ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ మాదిరిగా నోటీస్ బోర్డుల్లో అర్హుల జాబితాలు ప్రకటిస్తామని కావున లబ్ధిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం పేదరికంను మాత్రమే కొలబద్దగా చూస్తున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్న తపనతోనే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.