రైతులకు ఏం చేశారో?.. దేవినేనిపై పేర్ని విమర్శలు

గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:42 IST)
ఐదేళ్లు మంత్రిగా ఉండి కూడా తన ప్రాంత సుబాబుల రైతులకు న్యాయం చేయలేని  మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులు పై విమర్శలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని  పేర్కొన్నారు.

చందర్లపాడు మండలం కొనాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని శాసనసభ్యులు  మొండితోక జగన్మోహనరావు, ,సామినేని ఉదయభాను, వసంత కష్ట ప్రసాద్ లతో కలిసి  ఆవిష్కరించారు,

ముందుగా గ్రామంలోని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం  మంత్రి పేర్నినాని మాట్లాడుతూ అయిదేళ్లు మంత్రిగా ఉండి సుబాబుల రైతులకు ఏం చేశారో చెప్పాలని దేవినేనిని డిమాండ్ చేశారు.

శాసనసభ్యుడు.జగన్ మోహన్ రావు  మాట్లాడుతూ చంద్రబాబు పాలన పుణ్యమాని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేలా ముఖ్యమంత్రి  జగన్ కృషి చేస్తున్నారన్నారు,

రాష్ట్రం అప్పులో ఊబిలో ఉందని ఆయన ఉన్నంతకాలం ఓవర్డ్రాఫ్ట్ లతోనే కాలం గడిపారన్నారు ,కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని కష్టాల్లో బాధ్యతలు చేపట్టినప్పటి ఒక్కపైసా అప్పు చేయకుండా క్రమశిక్షణతో పాలన సాగిస్తున్నారని తెలిపారు.

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments