ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:37 IST)

తెలంగాణలో ఎక్కువ మార్కులొచ్చినా ఉద్యోగమేదీ?

కానిస్టేబుల్ ఫలితాలపై కొంతమంది అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్​ ఫలితాల్లో ఏదో గందరగోళం నెలకొందని అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన వారికంటే ఎక్కువ మార్కులొచ్చినా... తమ పేరు జాబితాలో లేదని ఆవేదన చెందుతున్నారు.

ఉద్యోగం రాని వివిధ జిల్లాలకు చెందిన కొంతమంది అభ్యర్థులు లక్డీకపూల్​లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అనుమతి లేకపోవడం వల్ల హెల్ప్ లైన్ కేంద్రంలో ఉన్న అధికారులను కలిసి సమస్యలను విన్నవించారు.

సందేహాలున్న అభ్యర్థులు.... పోలీస్ నియామక మండలి వెబ్ సైట్​లో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే.... రెండు నుంచి మూడువారాల్లో సమాధానమిస్తామని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.శ్రీనివాస్ రావు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శించకుండా.. కేవలం వారి వారి వ్యక్తిగత లాగిన్​లలోనే వివరాలు పొందుపర్చడం వల్ల పారదర్శకత లోపించిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.