బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:42 IST)

తెలంగాణలో ఇంటర్మీడియట్ రుసుంలపై హైకోర్టులో విచారణ

ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఇంటర్మీడియట్ రుసుములుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్​పై జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

జూనియర్ కాలేజీలు బోర్డు ఉత్తర్వులు అమలు చేయకుండా.. భారీ రుసుములతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. కాలేజీల్లో తీసుకోవాల్సిన ఫీజులను 2013 మే 24న ఇంటర్ బోర్డు ఖరారు చేసిందని వివరించారు.

ఇంటర్ బోర్డు ఉత్తర్వులను అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం... రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి, ఇంటర్ బోర్డు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.