శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 11 జూన్ 2020 (17:59 IST)

శ్రీవారి భక్తులతో గోవిందనామస్మరణలతో మారుమ్రోగిన అలిపిరి

తిరుమల శ్రీవారి దర్సనార్థం సామాన్య భక్తులను ఈరోజు నుంచి అనుమతించింది టిటిడి. టోకెన్లు పొందిన భక్తులను అలిపిరి పాదాల నుంచి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు అనుమతించారు. 80 రోజులుగా బోసిపోయిన కనిపించిన అలిపిరి సామాన్య భక్తులతో కళకళలాడింది.
 
గోవింద నామస్మరణలతో భక్తులు తిరుమలకు పయనమై వెళ్ళారు. నిన్న ఆఫ్‌లైన్లో 3వేల టోకెన్లను అందించింది టిటిడి. అయితే భక్తులు అధికసంఖ్యలో క్యూలైన్లలో నిలబడి ఉండటంతో 14వ తేదీ వరకు టోకెన్లను అందించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి పాదాల మండపం తిరుమలకు అనుమతించారు.
 
అలాగే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా టోకెన్లను చూసిన తరువాత భక్తులను సొంత వాహనాల్లోను, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు అనుమతించారు. భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల, తిరుపతి ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతోంది. చాలారోజుల తర్వాత భక్తులను చూసిన స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలకు శానిటైజేషన్ చేయడం.. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తరువాతనే పంపిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.