గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:11 IST)

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

Pithapuram
Pithapuram
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నారు. ల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏలేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని.. ఏలేరును వరదాయినిగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన వాగ్ధానాన్ని పవన్ కాపాడారు. 
 
ఇందులో భాగంగా గొల్లప్రోలు దగ్గర ఏలేరు సుద్దగడ్డ వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇదే కాకుండా పిఠాపురంలో అభివృద్ధిని పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులకు పవన్ కల్యాణ్‌పై అభిమానం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను దేవుడు అంటూ స్థానికులు, ప్రజలు అంటున్నారు.