శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (20:32 IST)

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది : జవహర్

పోలీసు అమర వీరుల త్యాగాలు వృధా అవుతున్నాయని టీడీపీ నేత జవహర్ అన్నారు. వారిని స్మరించుకునే రోజును కూడా ప్రతీకార దినంగా చేయడం దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రం పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు.

పోలీస్ బాస్ వైసీపీ నాయకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పదే పదే గృహ నిర్బంధంతో తన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందన్నారు.

తనపై పోలీసులు కక్ష కట్టారని... రెండు నుండి మానసికంగా తనను వేధిస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వెళ్ళకుండా అడ్డుకోవటం ముమ్మాటికి నేరమే అని చెప్పుకొచ్చారు.

అధికారం ఉందని పోలీసులతో ఊడిగం చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు దీక్షకు వెళ్ళకుండా ఆపినంత మాత్రాన ప్రజలకు నిజాలను దాయలేరని జవహర్ పేర్కొన్నారు.