గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (11:27 IST)

జగన్‌‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్.. మెమో ఇచ్చేందుకు రెడీ

jagan
jagan
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు చుక్కెదురైంది. ఈ మేరకు కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ పరామర్శించిన సందర్భంగా అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ దిగారు. 
 
ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడంపై పోలీసు శాఖ ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.