మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (11:07 IST)

గృహ నిర్భంధంలో హరీశ్‌ రావు... ఆసుపత్రికి వెళ్తాను అంటే కూడా వదల్లేదు.. (video)

harish rao
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావును గృహ నిర్భంధం చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హైదరాబాద్‌ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 
 
ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు. హరీశ్‌రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అడ్డుకున్నారు. ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు. 
 
ఈ నేపథ్యంలో శంభీపూర్‌ రాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయనను హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన నివాసానికి వస్తున్న పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. 
 
గురువారం పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తాను అంటే పోలీసులు అనుమతించలేదు.