శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (19:11 IST)

పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల యార్లగడ్డ సంతాపం

పొత్తూరి వెంకటేశ్వర రావు
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ఛైర్మన్ ఆచార్య డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సీనియర్ జర్నలిస్ట్‌గా పొత్తూరి సేవలు వెలకట్టలేనివన్న యార్లగడ్డ, పాత్రికేయుడిగా ఆరు దశాబ్దాల ఆయన గమనం చిరస్మరణీయమన్నారు. 
 
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తనదైన ప్రత్యేక శైలి చూపిన పొత్తూరి మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. పాత్రికేయులకు మార్గదర్శకునిగా, సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని సాక్షిగా నిలిచారన్నారు. 
 
తన రచనలతో జాతిని జాగృతం చేయటమే కాక, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గానూ పొత్తూరి ఆ పదవికి వన్నె తెచ్చారని అచార్య యార్లగడ్డ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.