శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (16:18 IST)

బోసడీకే అంటే తిట్టు కాదు... దానర్థం ఇదే... రఘురామ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత నీచస్థితికి దిగజారిపోయాయి. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు టీడీపీ నేతల ఇళ్ళపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డారు. అయితే, ఈ దాడులకు ప్రధాన కారణంగా పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చేసిన బోసడీకే అనే పదంమే. 
 
ఈ మాటకు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చారు. బోసడీకే అనే పదానికి అర్థం వెతికి చెప్పారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రఘురామ తెలిపారు. 
 
'టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనేదానికి అర్థం' అని రఘురామ రాజు వివరించారు.