అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్

Pawan Kalyan
శ్రీ| Last Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:07 IST)
అమరావతి అంశంపై నేను న్యాయ సలహాలు తీసుకొని మాత్రమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ అమరావతి గురించి చాల స్పష్టంగా, అమరావతినే రాజధానిగా ఉండాలని
చెప్పారు. గతంలో రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు.

గతంలో “అత్తారింటికి దారేది” అన్న పవన్ కళ్యాణ్ నేడు “అమరావతికి దారేది” అని ముందుకు వస్తున్నారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య.
మా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అన్నారు.

జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడో ఉండాలి అనుకున్నా, కానీ జగన్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇక హిందూ దేవాలయాలు మీద దాడులు హిందువుల మనోభావాల మీద ఆటలు ఆడుతున్నారు. పార్టీలకు
అతీతంగా
దేవుళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హిందువుల మనోభావాలు కపాడతామని అందరూ ప్రమాణం చేయాలన్నారు.దీనిపై మరింత చదవండి :