శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:12 IST)

వర్మ హీరోయిన్‌పై కంగనా రనౌత్ అసభ్యకర వ్యాఖ్యలు

నటి ఊర్మిళ పేరు చెబితే.. ఠక్కున రాంగోపాల్ వర్మ గుర్తుకు వస్తారు. బాలీవుడ్ నటి ఊర్మిళ ఆమధ్య రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు. అసలు విషయానికి వస్తే, బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం గురించి ఊర్మిళ వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ సమస్య దేశం మొత్తం ఉందనీ, మాదక ద్రవ్యాలకు తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కేంద్ర బిందువు అని కంగనకు తెలుసా, తన సొంత రాష్ట్రం గురించి కంగన ముందు ఆలోచించాలంటూ వ్యాఖ్యలు చేసింది.
 
ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర పదజాలం వాడింది. ఓ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... `ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్. ఈ మాట కఠినంగా ఉండొచ్చు కానీ అదే నిజం. అసలామె గొప్ప నటి అని ఎప్పుడూ నిరూపించుకున్నారు? సాఫ్ట్ పోర్న్ తరహా పాత్రలు చేయడం తప్ప ఆమె చేసిందేముందని ప్రశ్నించిన కంగనా, అసలామె రాజకీయాల్లోకి రాగా లేనిది, నేను వస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది.
 
కంగనా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటి ఊర్మిళకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.