పోలవరంపై ఏపీకి షాకిచ్చిన కేంద్రం
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని కేంద్రం బాంబు పేల్చింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీ సర్కారుకు పోలవరం విషయంలో షాకిచ్చింది మోదీ సర్కారు. సోమవారం రాజ్యసభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు.
ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి వెల్లడించారు.
2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి రవీంద్రకుమార్ వెల్లడించారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందని ప్రకటించారు.