సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (13:52 IST)

సీఎం జగన్ హస్తిన టూర్ రద్దు వెనుక కారణమిదే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం హస్తిన పర్యటనకు వెళ్లాల్సివుంది. ఈ పర్యటన షెడ్యూల్‌ను కూడా సీఎం క్యాంపు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన ముఖ్యాంశమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి, రాష్ట్ర పరిస్థితులను వివరించడమే కాకుండా, ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, పంచాయతీ భవనాలకు వైకాపా పర్టీ జెండా రంగులు తదితర అంశాలపై చర్చిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, పర్యటన ప్రారంభానికి కేవలం 2 గంటల ముందు సీఎం జగన్ టూర్ రద్దు అయింది. 
 
అయితే, ఈ పర్యటన రద్దుకు గల కారణాలు ఢిల్లీ వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఏపీకి చెందిన బీజేపీ నేతలు కొందరు పార్టీ అధిష్టానానికి ఓ లేఖ పంపించారు. ఇందులో రాష్ట్రంలో జరుగతున్న పరిస్థితులను కూలంకుశంగా వివరించారు. ముఖ్యంగా, పంచాయతీ భవనాలకు పార్టీ జెండా గుర్తులు వేయడం, ఎస్ఈసీ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేయడం, తితిదే భూముల వ్యవహారం, తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. 
 
ఈ లేఖను బీజేపీ హైకమాండ్ నిశితంగా పరిశీలించింది. అదేసమయంలో సీఎం జగన్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్‌ను హోం మంత్రి అమిత షా రద్దు చేశారు. నిసర్గ తుఫాను ముందస్తు చర్యల్లో బిజీగా ఉన్నందుకు ఈ అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు హోం మంత్రి కార్యాలయం పేర్కొంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన హస్తిన పర్యటను వాయిదావేసుకున్నారని బీజేపీ ఢిల్లీ వర్గాల సమాచారం.