బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:07 IST)

అన్నంతపని చేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి!

తెలంగాణ ఆడబిడ్డ, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి అన్నంతపని చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాన

తెలంగాణ ఆడబిడ్డ, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి అన్నంతపని చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, ఆధార్‌కు పునాది వేసింది తామేనని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు రేణుకా చౌదరి బిగ్గరా నవ్వారు. రేణుక నవ్వడంపై ప్రధాని సభలో స్పందిస్తూ, 'రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్ని విపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతరం కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరణ్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్‌బుక్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్‌లోని శూర్ఫణఖ పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోడీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజ్యసభలో తన నవ్వుపై మోడీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. 'ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను' అని రేణుక పేర్కొన్నారు.