గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (09:41 IST)

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో గల పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్టలేరు ప్రాంతాల నుంచి  వరద నీరు వచ్చి చేరుతోంది.

వరద ఉధృతిపై ప్రకాశం బ్యారేజి ఎగువ ప్రాంతాల అధికారులను కలెక్టర్ జె నివాస్ అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి 40 గేట్ల ద్వారా రెండు అడుగుల మేర ఎత్తి  35 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

నందిగామ మండలం నుంచి వీరులపాడు మండలానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద వరద నీరు 12 అడుగులు చేరుకుంది. 

పోలంపల్లి ఆనకట్టపై 50వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి కాజ్వేపై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.