శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:38 IST)

భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలి: బీజేపీ నేత

కృష్ణా జలాల విషయంలో రాజకీయ అంశాలు ప్రక్కన పెట్టి...చట్టబద్దంగా వ్యవహరించాలని బీజేపీ నేత పోంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కూర్చుని మాట్లాడుకుంటే నీటి వివాదం పరిష్కారం అవుతుందని తెలిపారు.

పోలవరానికి వ్యతిరేకం కాదు కానీ...భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నదులు అనుసంధానం దిశగా ప్రధాని యోచిస్తూన్నారన్నారు. థర్డ్ వేవ్ రాకుడదు అంటే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని... వ్యాక్సినేషన్ చెయ్యించుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు.

మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం అర్ధరాత్రి మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.

దీంతో పలు కాలనీలో జలమయమయ్యాయి. వరద జిల్లాలోని చేగుంట మండలంలో అత్యధికంగా 22.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శివంపేట 14.3, తూప్రాన్ 12.7, వెల్దుర్తి 9.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.