బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 17 జులై 2021 (19:32 IST)

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 63,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 316.750 మీటర్లకు చేరుకుంది.
 
దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 37,150 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 810.50 అడుగులు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 34.6077 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.