1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (09:08 IST)

ప్రకాశం బ్యారేజ్ నుండి 8,500 క్యూసెక్కుల నీరు విడుదల

ప్రకాశం బ్యారేజ్ నుండి 8,500 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ దిగువుకు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ.రాజాస్వరూప్‌కుమార్ తెలిపారు.

తెలంగాణా విద్యుత్తు ఉత్పత్తితో పులిచింతల బ్యారేజ్ నుండి ప్రస్తుతం 6,500 క్యూ సెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు విడుదల చేస్తున్నారని, దీంతో పాటు ఎగువున కురిసిన వర్షాల కారణంగా మునేరు, కట్టలేరు, పాలేరుల ద్వారా కీసర నుండి మరో 1,900 క్యూ సెక్కులు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకోవడం జరిగిందన్నారు.

అయితే.. ప్రకాశం బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3.07 టియంసిలు మించి ఎగువున నుండి నీరు చేరుకోవడంతో నీటిని దిగువుకు విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ 20 గేట్లను ఎత్తివేసి 8,500 క్యూసెక్కుల నీటిని దిగువుకు విడుదల చేసినట్లు వివరించారు.

ఎగువు నుండి నీరు ఇదే పరిస్థితిలో చేరుకుంటే దిగువుకు నీటిని విడుదల చేయడం కొనసాగిస్తామని, లేనిపక్షంలో గేట్లను తిరిగి మూసివేస్తామని వివరించారు.