Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయ

Written By TJ
Updated: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:10 IST)
అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని చెప్పకుండా జగన్ సన్నిహితుడు వచ్చేస్తున్నాడు.. ఇక వైసిపి పని అయిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసిపి నేతల్లో గుబులు తెప్పిస్తోంది. 
 
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ కూడా. గత కొన్నిరోజులుగా వైసిపి నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. అందుకే ఆయన టిడిపిలోకి వచ్చేస్తున్నారని మంత్రి స్వయంగా ప్రకటన చేశారు. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి టిడిపిలో వెళ్ళినా ఏ పదవులు రావు. 
 
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం లేదు. ఊరికే పార్టీలో నేతగా ఉండాలి తప్ప శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి మాత్రం కొట్టిపారేస్తున్నారు. కావాలనే అధికార పార్టీ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments