సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 18 అక్టోబరు 2017 (20:44 IST)

నాకంటే డబుల్ ఏజ్ వున్నవాడితో డేటింగా? సెర్చ్ చేసి చూశా... నమిత

బొద్దందాల నమిత చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది కూడా ఏదో కొత్త సినిమాలో నటిస్తూ కాదు. సీనియర్ నటుడు, రమాప్రభ మాజీ భర్త శరత్ బాబుతో నమిత డేటింగ్ అంటూ వచ్చిన రూమర్లు కారణంగా. నటుడు శరత్ బాబును నమిత పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్దిరోజుల

బొద్దందాల నమిత చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది కూడా ఏదో కొత్త సినిమాలో నటిస్తూ కాదు. సీనియర్ నటుడు, రమాప్రభ మాజీ భర్త శరత్ బాబుతో నమిత డేటింగ్ అంటూ వచ్చిన రూమర్లు కారణంగా. నటుడు శరత్ బాబును నమిత పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనిపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరికి నమిత కూడా షాక్ తిన్నది. 
 
తను ఈ రూమర్ విని అసలు శరత్ బాబు ఎవరో తెలుసుకుందామని గూగుల్ సెర్చ్ చేశానని చెప్పింది. చివరికి గూగుల్లో శరత్ బాబు వివరాలను చూసి షాకయ్యాననీ, తనకంటే రెట్టింపు వయసున్నవాడితో తను డేటింగ్ చేస్తున్నాననీ, పెళ్లి చేసుకోబోతున్నాననే వార్త ఎవరు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.