గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (08:27 IST)

కరోనా వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గింది.. అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గింది!!

sajjala
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారిపోయింది. ఫలితంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి గల కారణాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  వివరించారు. కరోనా సంక్షోభం వల్ల గత రెండేళ్లుగా విద్యా సంస్థలు సరిగా నడవలేదనీ, విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గి ఉంటుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. అందుకే పది ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గిందని చెప్పారు. 
 
మరోవైపు, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం కూడా ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపి ఉంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మాద్యమం తొలిసారి ప్రవేశపెట్టినందున కొన్ని ఇబ్బందులు సహజమేనని, అందువల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గివుంటుందని అభిప్రాయపడ్డారు. 
 
అన్నిటికంటే ముఖ్యంగా పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్నామని, ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యింటుందని అన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిపామా? లేదా? అన్నది తమకు ముఖ్యమని పేర్కొన్నారు.