1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (19:27 IST)

వైఎస్ షర్మిల అరెస్ట్.. స్పందించిన ఏపీ సలహాదారు సజ్జల

sajjala ramakrishna reddy
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల అరెస్ట్ బాధాకరమని చెప్పారు.

తమ నాయకుడు వైఎస్సార్ కుమార్తె, సీఎం జగన్ సోదరి షర్మిల పట్ల తెలంగాణలో జరిగిన ఘటన తమకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.

కానీ షర్మిల పార్టీ వేరైనా మహిళను అలా అరెస్ట్ చేయడం పట్ల సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విధానాలపై స్పందించేది లేదని.. కానీ షర్మిల అరెస్ట్ సరికాదన్నారు. 
 
ఇకపోతే సోమవారం నర్సంపేటలో షర్మిల వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును షర్మిల స్వయంగా డ్రైవింగ్ చేశారు. దీంతో పోలీసులు ఎంత అడ్డుకున్నా.. ఆమె కారు నుంచి బయటికి రాలేదు. ప్రగతి భవన్‌కు వెళ్తానని షర్మిల పట్టుబట్టారు. 
 
కారు డోర్లను లాక్ చేసుకుని లోపలే వుండిపోయారు. ఇక చేసేదేమీ లేక ఆ కారును క్రేన్ సాయంతో పోలీసులు తరలించారు. ఆ తర్వాత కారు డోర్స్‌ను బ్రేక్ చేసి షర్మిలను పోలీసు స్టేషన్ లోకి తరలించారు. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది.