బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:07 IST)

దేవినేని ఉమపై రాళ్ల దాడి

రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ ఆగడాలు రోజురోజు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దేవినేనిపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వసమయ్యాయి. గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను ఆయన పరిశీలించేందుకు వెళ్లారు. జి.కొండూరు మండలంలో రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు.

అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.