బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 జులై 2021 (23:23 IST)

పాక్‌లో సైనిక చెక్ పోస్టుపై ఉగ్రవాదుల దాడి

పాకిస్థాన్ దేశంలోని సైనిక చెక్ పోస్టుపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. గిరిజన జిల్లా అయిన నార్త్ వజిరిస్థాన్ లోని హసన్ ఖేల్ ఏరియా బేజా సైనిక చెక్ పోస్టుపై గుర్తుతెలియని ఉగ్రవాదులు దాడి చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ సైనిక చెక్ పోస్టుపై జరిగిన ఉగ్ర దాడిలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డారు. గాయపడిన పాక్ జవాన్ ను ద్వాటోయి ప్రాంత ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాడి చేశారు.
 
దీంతో పాక్ అదనపు సైనిక బలగాలను చెక్ పోస్టులో మోహరించింది.గత వారం ఆఫ్ఘాన్ వైపు నుంచి ఉగ్రవాదులు మిలటరీ పోస్టుపై కాల్పులు జరిపారు. వారంరోజుల నాటి కాల్పుల ఘటనలో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పాకిస్థాన్ దేశానికి 2,600 కిలోమీటర్ల మేర ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ఉండటంతో ఉగ్రదాడులు తరచూ జరుగుతున్నాయి.