సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (18:12 IST)

నెల్లూరు సముద్ర తీరంలో చేపల దొంగలు అరెస్టు

నెల్లూరు జిల్లా సముద్ర తీరంలోకి హైస్పీడ్ బోట్లలో వచ్చి దొంగతనంగా చేపల వేట కొనసాగిస్తున్న తమిళనాడు జాలర్లను స్థానిక జాలర్లు పట్టుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన జాలర్లుగా గుర్తించారు. దీంతో ఆ ప్రదేశంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. మొత్తం 11 హైస్పీడ్ బోట్‌లను జాలరులు పట్టుకున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వారి మధ్య సమస్య పరిష్కరించడానికి అధికారులు చర్చలకు దిగారు. 
 
నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలో 94 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులు సముద్ర లోతట్టు ప్రాతంలో అయిలా వలతో చేపల వేట సాగిస్తారు. హైస్పీడ్ బోట్‌లు, డోజర్లు సమద్రంలో అలలు వచ్చే ప్రాంతానికి 5 కిమీ దురంలో వేటను సాగిస్తాయి. కానీ తమిళనాడుకు చెందిన జాలరులు లోతట్టు ప్రాంతంలో వందల కొద్ది హైస్పీడ్ బోట్‌లతో వేట సాగిస్తుండటంలో స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 
మత్స్యకారుల వలలు తెగిపోయి ఏటా రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. తమిళనాడు రాష్ట్రం నిషేధించిన చిన్నకన్ను వలలతో వారు వేట సాగిస్తూ కొట్ల రూపాయల మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. వారి దారుణానికి వలలు తెగిపోయి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తీరానికి వచ్చిన 11 హైస్పీడ్ బోట్‌లను మైపాడు, కృష్ణాపురం, కోమలి జాలరులు అడ్డుకున్నారు. ఇదేవిషయంలో మునుపు చాలా సార్లు వివాదాలు జరిగాయి కానీ వారు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సంఘటన జరగడంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగామారింది.