శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:16 IST)

బిర్యానీలో చికెన్ పీస్ కోసం అమ్మాయిని చంపేశారు...

బిర్యానీలో చికెన్ పీస్ కోసం అమ్మాయిని చంపేసిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై నగరంలో నిత్యం రద్దీగా ఉండే కోయంబేడు మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. కోయంబేడు మార్కెట్ ఎప్పటిలాగే బిజీగా ఉంది. సోమవారం రాత్రి 25 ఏళ్ల వయస్సు గల ఓ అమ్మాయి ఒక అబ్బాయితో మార్కెట్‌కి వచ్చింది. షాపింగ్ ముగించుకున్న తర్వాత అక్కడే బిర్యానీ పార్సిల్ తీసుకున్నారు. 
 
మార్కెట్ ఏరియాలోనే ఓ చోట కూర్చొని బిర్యానీ తింటున్నారు. ఆ సమయంలో అమ్మాయి బిర్యానీలో చికెన్ పీస్ రాలేదని అబ్బాయికి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ కాస్త పెరగడంతో అబ్బాయి కోపంతో కత్తి తీసుకొచ్చి ఆమె గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావంతో అమ్మాయి కుప్పకూలింది. అక్కడ ఉన్న వారు పరుగున ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
 
అబ్బాయి మాత్రం భయంతో అక్కడి నుండి పారిపోయాడు. మార్కెట్‌లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.