సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (13:53 IST)

వైసీపీలో చేరిన టీడీపీ నేత.. భూమన నివాసంలో కండువా కప్పుకున్నారు..

తెలుగుదేశంలో కీలక నేత, నగర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మార్కెట్‌ దొరైరాజ్‌ తన అనుచరులతో కలసి శుక్రవారం వైసీపీలో చేరారు. పద్మావతిపురం నుంచి ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే భూమన నివాసంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. 
 
దొరైరాజ్‌ కుటుంబానికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. 1991నుంచి 2002వరకు దొరైరాజ్‌ తన అనుచరుడిగానే ఉన్నారని, అనంతరం పలు కారణాల రీత్యా టీడీపీలోకి వెళ్లారన్నారు. ఆయనతో పాటు పరసాల వీధి ఆనంద్‌, శ్రీధర్‌రాయల్‌, ప్రసాద్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.