వైఎస్ జగన్ కోసం సంగారెడ్డి యువకుడి పాదయాత్ర..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఏపీ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఏపీ సీఎంకు సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. జగన్ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా పాదయాత్రలు కూడా చేస్తున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో జగనన్నని ఒక్కసారైనా నేరుగా చూడాలంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుకున్నాడు.
దీంతో అనుకున్న ప్రకారమే ఈనెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జగన్ కోసం పాదయాత్ర ప్రారంభించాడు. తన స్వగ్రామం నుంచి సీఎం జగన్‌ను చూసేందుకు కాలినకడన బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం ఇలా పాదయాత్ర చేయడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.
కాగా.. తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలను జగన్ నిలిపివేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. తెలంగాణ జగన్ సోదరి షర్మిల పార్టీని ప్రారంభించారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడాన్ని జగన్ వ్యతిరేకించినట్టుగా ఆ పార్టీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.