శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:50 IST)

వైఎస్ వివేకా హత్య కేసులో చిక్కుముడి వీడినట్టేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. 
 
సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సునీల్‌ను గోవాలో అరెస్ట్ చేయగా, ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.  
 
మరోవైపు, ఈ కేసులో మరికొంతమంది వద్ద సీబీఐ విచారణ జరిపింది. ఇపుడు సునీల్‌ను తమ కష్టడీకి తీసుకుని విచారించిన తర్వాత మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.