Daily Horoscope
✕

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు

Written By ఎం
Updated: బుధవారం, 10 జూన్ 2020 (19:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

జులై 10 నుంచి పరీక్షలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో రద్దు చేసినా ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి నిర్వహిస్తామన్నారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.. వారందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ జిఒ జారీ చేసింది.

అనంతరం తమిళనాడు ప్రభుత్వమూ తెలంగాణ బాటలోనే నడిచి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటించింది. ఎపిలో ఓ పక్క కేసులు పెరుగుతున్నా పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్నీ చూడండి

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments