బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (10:13 IST)

16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి జరుగనున్నాయి. 19న రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగాల్సిఉండటం, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్‌ను తప్పనిసరిగా ఆమోదించాల్సిఉండటంతో సమావేశాల నిర్వహణకే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొగ్గుచూపినట్లు సమాచారం.

రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు సమావేశాలు ప్రారంభించాలని, 19న అనంతరం 20, 21 తేదీల్లో సెలవుల తరువాత మళ్లీ సోమవారం నురచి సమావేశాలు కొనసాగిచాలని భావిస్తున్నట్లు తెలిసింది.

సచివాలయ భద్రతా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఖరారు కావడరతో సమావేశాల నిర్వహణకు సంబంధించిన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉరటురదని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఉభయ సభల సంయుక్త సమావేశంతో పాటు, శాసనసభలో ఉన్న 175 మందికి భౌతిక దూరం పాటిస్తూ సీట్ల ఏర్పాటు చేయడం అధికారులకు సవాల్‌గా మారనుంది.