సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (21:43 IST)

జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన గంటా

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా విశాఖ మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ.. ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలుగుదేశం నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

సహజసిద్ధమైన సముద్రతీరం కలిగిన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమన్నారు. రోడ్డు, రైలు, గాలి, నీరు అనుసంధానంతో అందరి ఆశలు, ఆకాంక్షలని నెరవేర్చే నగరంగా మారతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని చెప్పారు. తమ సహకారాన్ని అందించేందుకు విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.