బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2024 (22:12 IST)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

TV Actress Shobitha
TV Actress Shobitha
టీవీ ఇండస్ట్రీ నటీమణులు వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని సి-బ్లాక్‌లోని తన నివాసంలో ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. 
 
పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మగంతు, నిన్నిందలే సీరియల్స్‌తో పాటు పలు చిత్రాలలో నటించిన శోభిత శివన్న గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఆమె తన భర్త సుధీర్‌తో కలిసి శ్రీరామ్‌నగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. 
 
శోభిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి బెంగళూరు తరలించే అవకాశం ఉంది.