ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిరోభారంగా మారిన కేసు

సోమవారం, 12 జులై 2021 (15:57 IST)
వైసీపీలో కొత్త‌గా ఎమ్మెల్సీగా ఎంపిక‌యిన తోట త్రిమూర్తులుకు పాత కేసు ఒక‌టి శిరోభారంగా మారింది. ద‌ళిత యువ‌కుల శిరోముండ‌నం కేసును వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఒక వ‌ర్గం ధ‌ర్నాకు దిగింది. తూర్పుగోదావ‌రి జిల్లా రామచంద్రపురంలో ఈ ధర్నాను అడ్డుకునేందుకు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రామ చంద్రపురంలో  భారీగా పోలీసులు మోహరించారు.

వెంకటాయపాలెం గ్రామంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఆనాటి  కేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై అభియోగాలున్నాయి. ఈ కేసును తక్షణమే పరిష్కరించాలని, గవర్నర్ కోటాలో తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలని ధ‌ర్నాకు దిగారు.

దళిత మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో భారీగా పోలీసుల మోహరించ‌గా, ఆందోళన చేసేందుకు దళిత సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు త‌ర‌లివ‌స్తుండ‌టం ఉద్రిక్త‌త‌కు దారితీస్తోంది.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments