శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (11:30 IST)

అట్టపెట్టెలో చిన్నారి మృతదేహం... ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ దారుణం జరిగింది. ఓ అట్టపెట్టెలో ఓ చిన్నారి మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చిన్నారి మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయారు. 
 
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శిశువు ఏడుపును కాటికాపరి శివ గమనించాడు. వెంటనే చిన్నారిని చేతుల్లోకి తీసుకుని స్థానికంగా నివసించే వెంకటేశ్ దంపతులకు అప్పగించాడు. వారు వెంటనే స్థానిక ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తరలించారు.
 
అయితే, శిశువు పరిస్థితి విషమంగా మారడంతో 108 నియోనాటల్ అంబులెన్స్ ద్వారా కాకినాడ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)కు తరలించారు. చిన్నారి బరువు 750 గ్రాములు మాత్రమే ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఆ గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ళలో వున్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తద్వారా నిందితుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.