మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఏప్రియల్ 2021 (22:17 IST)

ఎన్ఐయూఏ- బీవీఎల్ఎఫ్‌ల ఇన్‌ఫాంట్, టాడ్లర్, కేర్ గివర్ శిక్షణ- సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమం

బెర్నార్డ్ వాన్ లీర్ ఫౌండేషన్(బీవీఎల్ఎఫ్)తో కలసి 2021 ఏప్రిల్ 13న ఇన్‌ఫాంట్, టాడ్లర్, కేర్ గివర్ స్నేహపూర్వక పరిసరాల శిక్షణ మరియు సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) ప్రారంభించింది. భారతదేశపు నగరాల్లో చిన్నారుల, కుటుంబ స్నేహపూర్వక పరిసరాలను అభివృద్ధి చేయడంలో నగర అధికారులు, యువ వృత్తినిపుణులకు సామర్థ్యాలను అందజేసేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. 
 
ఈ కార్యక్రమం ఎన్ఐయూఏ మరియు బీవీఎల్ఎఫ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యం కొనసాగింపు. నగరస్థాయి కార్యక్రమాల్లో పరిసరాల స్థాయిలో శిశు, చిన్నారులు, సంరక్షకుల అవసరాలపై చేయాల్సిన ప్రయత్నాలకు సంబంధించి ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ కార్యక్రమం కింద నగర అధికారులు, యువ వృత్తినిపుణులకు సర్టిఫైడ్ ట్రైనింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ మాడ్యూల్స్ ద్వారా నైపుణ్యాలు అందించాలని ప్రతిపాదించబడింది. చక్కగా రూపొందించబడిన శిక్షణ మాడ్యూల్స్ ద్వారా ఆన్లైన్లో నేషనల్ అర్బన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ (ఎన్ యూఎల్పీ) ద్వారా ఈ శిక్షణ అందించబడుతుంది. విజ్ఞానం అందించేందుకు గాను ఎన్ఐయూఏ, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఓహెచ్ యూఏ)లచే ఈ ప్లాట్ ఫామ్ అభివృద్ధి చేయబడింది.
 
రెండు ఆశయాలతో ఈ కార్యక్రమం నిర్వహింబడుతోంది: మొదటిది, పరిసరాలు, నగర స్థాయిలో ఇప్పటికే కొనసాగుతున్న, ప్రతిపాదిత పట్టణాభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్‌లు అభివృద్ధి చేసిన నాలెడ్జ్ నుంచి నేర్చుకున్న అంశాలను పొందుపర్చడం. రెండోది, చిన్నారులు, సంరక్షకుల రోజువారీ అవసరాలను పరిగణనలోకి తీసుకొని తాము నేర్చుకున్న అంశాలను వివిధ నగరాల కార్యక్రమాల్లో చేర్చేలా చేయడం. దానికి అదనంగా నగరంలోని చిన్నారుల (0-5 ఏళ్లు) అవసరాలపై యువ వృత్తి నిపుణులకు అవగాహన కల్పించే నిమిత్తం, అందుకుగాను వారిని వివిధ ఉపకరణాలతో సన్నద్ధులుగా చేసేందుకు అకడమిక్ సర్టిఫైడ్ కోర్సు కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యూఏ) సంయుక్త కార్యదర్శి మిషన్ డైరెక్టర్ (స్మార్ట్ సిటీస్) శ్రీ కునాల్ కుమార్ ప్రారంభించారు.
 
ఎన్ఐయూఏ డైరెక్టర్ శ్రీ హితేశ్ వైద్య, బీవీఎల్ఎఫ్ భారతీయ ప్రతినిధి రుష్దా మజీద్, ఎన్ఐయూఏ సెంటర్ ఫర్ డిజటల్  గవర్నెన్స్ నేషనల్ ప్రోగ్రామ్ హెడ్ శ్రీ కాకుల్ మిశ్రా, ఎన్ఐయూఏ ఇన్ క్లూజివ్ డెవలప్మెంట్, సీనియర్ అడ్వయిజర్ శ్రీ అజయ్ సూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ సీఈఓలు, మునిసిపల్ కమిషనర్లు, యువ వృత్తి నిపుణులు కూడా ఆన్ లైన్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యూఏ) సంయుక్త కార్యదర్శి మిషన్ డైరెక్టర్ (స్మార్ట్ సిటీస్) శ్రీ కునాల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘చిన్నారుల కోసం రూపొందించే నగరం ప్రతీ ఒక్కరికీ అనువుగా ఉంటుంది. నగరాల్లో చిన్నారుల, కుటుంబ స్నేహ పూర్వక పరిసరాలను అభివృద్ధికి సామర్థ్యాలను నిర్మించడం అనేది భవిష్యత్ ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం లాంటిది’’ అని అన్నారు. 
 
ఎన్ఐయూఏ డైరెక్టర్ హితేశ్ వైద్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మనం చిన్నారుల దృక్పథం నుంచి నగరం అభివృద్ధి చేయడాన్ని యోచిస్తున్నామంటే మనం ప్రస్తుత తరం కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లే లెక్క. అభివృద్ధి ఫలాలను భావితరాలు కూడా ఆనందిస్తాయి. అలా జరగాలంటే, పరిసరాలు/స్థానిక స్థాయి ప్లానింగ్ అనేది చిన్నారుల దృక్పథం నుంచి జరగడం ఎంతో ముఖ్యం’’ అని అన్నారు. 
 
బెర్నార్డ్ వాన్ లీర్ ఫౌండేషన్ భారతీయ ప్రతినిధి రుష్దా మజీద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఏ పట్టణ ప్రణాళికకైనా కూడా అక్కడి నివాసుల అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రజలందరికీ ఉప యోగపడేవి ఏంటనేదానికి తరచుగా చిన్నారులే చక్కటి సూచికలవుతారు. ఎన్ఐయూఏతో భాగస్వామ్యంతో, నగర అధికారులు, యువ అర్బన్ ప్లానర్లకు వారు తమ నగరాలను మరింత సమానావకాశాలు కల్పించేవిగా, చేకూర్పు ఇచ్చేవిగా, చిన్నారులకు, వారి కుటుంబసభ్యులకు స్నేహపూర్వకంగా ఉండేవిగా చేయడంలో సరైన శిక్షణ, ఉపకరణాలు, వనరులను సమకూర్చుకునేలా చేయడం మా లక్ష్యం’’ అని అన్నారు.