గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (21:53 IST)

బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది.

కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ ‘హాల్​మార్క్’ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబరులో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వ్యాపారులకు ఈ ఏడాది(2021) జనవరి 15 వరకు గడువిచ్చింది.
 
కాగా... కరోనా నేపధ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ ఒకటి వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. కాగా... ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టరయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొ్న్నారు. మొత్తంమీద... జూన్ ఒకటి నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులుంటాయని వెల్లడించారు.