శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 12 జులై 2021 (15:39 IST)

బెజ‌వాడలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీకి పోలీసుల బ్రేక్

విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు తగ్గించాలని విజయవాడ సిటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది.

కానీ, ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. దీనితో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్ సెంట‌ర్లో వాగ్వాదం జ‌రిగింది. పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ అధిష్టానం పిలుపు మేరకు చేస్తున్న ర్యాలీని, పోలీసులు అడ్డుకోవడం దారుణమ‌ని, సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర శెట్టి నర్శింహారావు అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇటువంటి సైకిల్ ర్యాలీ ఈ నెల 15న భారీగా చేస్తామ‌న్నారు.