శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (10:20 IST)

వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు?

Tirupati
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వరల్డ్ క్లాస్ డిజైన్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇప్పటికే ఈ డిజైన్లు పూర్తికావడంతో ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. 
 
ఈ మేరకు వారు తిరుపతి ఎంపీ గురుమూర్తికి తమ అభ్యంతరాలను తెలిపారు. స్థానికుల అభ్యంతరాలపై ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.